NZB: సదాశివనగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి బ్రిడ్జి వద్ద వర్షం నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం కురిసిన అకాల వర్షంతో పెద్ద ఎత్తున నీరు బ్రిడ్జి కిందికి చేరింది. దీంతో ఇరువైపుల రాకపోకలకు ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు బ్రిడ్జి కింద నిలవకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.