KMM: ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి పడిన గీతకార్మికుడు మృతి చెందాడు. ఖమ్మం రూరల్ మండలంలోని చింతపల్లికి చెందిన ఎనిగళ్ల వీరభద్రం (48) ఆదివారం రోజు మాదిరిగానే తాటిచెట్టు ఎక్కి కల్లు తీస్తుండగా మోకు జారడంతో కింద పడ్డాడు. దీంతో సమీపంలో ఉన్న వారు వచ్చిచూసే సరికి ఆయన తీవ్ర గాయాలై మృతి చెందాడు. వీరభద్రంకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.