సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించిన ‘సురక్షిత మాతృత్వ పద్ధతుల’ సదస్సులో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొన్నారు. గర్భిణీలు ఆసుపత్రిలోనే ప్రసవించాలని, లింగ నిర్ధారణ నేరమని అన్నారు. మాతాశిశు మరణాల నివారణకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం నర్సింగ్ విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.