SDPT: కాంగ్రెస్తోనే పేదల సొంతింటి కల సాధ్యం అవుతుందని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు. చేర్యాల మండలం వీరన్నపేటలో నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి మాట్లాడారు. సొంత ఇల్లు అనేది పేదల కల అన్నారు. ఆ కలను నిజం చేయడానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. చేర్యాల ప్రాంతానికి మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు తీసుకొస్తానని వెల్లడించారు.