MDCL: మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని అలవాట్లు తప్పనిసరి అని నారపల్లి డా.సౌమ్య తెలిపారు. పండ్లు, కూరగాయలు, విత్తనాలు, చేపలు వంటి పోషకాహారం తీసుకోవడం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రోజూ వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి మెదడు చురుకుగా ఉంటుంది. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యలను ముందుగానే గుర్తించవచ్చన్నారు.