KMR: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు చదువుకోవాలని అప్పుడే సమసమాజం నిర్మాణం సాధ్యమని సూచించారు. హక్కులు చట్టం అందరు తెలుసుకోవాలన్నారు.