ASF: అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆసిఫాబాద్ DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ సోమవారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి వారి త్యాగాలను స్మరించుకున్నారు. భూమికోసం, భుక్తి కోసం, ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం పోరాడిన ఆదివాసీ అమరవీరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.