PDPL: రామగుండం కార్పొరేషన్ 43వ డివిజన్లో రీ పోలింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను మంగళవారం కలెక్టరేట్లో కలిసి ఫిర్యాదు చేసినట్లు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఎన్నికలలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 43వ డివిజన్లో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులను బెదిరింపులకు గురిచేశారని అన్నారు.