NLG: నాగార్జున సాగర్ నియోజకవర్గం పరిధిలోని అనుముల మండలం కుపాష్పల్లి గ్రామపంచాయతీలో ఇవాళ నూతన ఐకేపీ సెంటర్ ను సర్పంచ్ పెరమళ్ళ వేణుగోపాల్ ప్రారంభించారు. రైతులు దళారుల మోసాలకు గురికాకుండా ఐకేపీ కేంద్రంలోనే ధాన్యం అమ్ముకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, ఏపీఎం, వార్డు సభ్యులు, మహిళా సంఘ సభ్యులు, రైతులు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.