SDPT: ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడంతోపాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ సీఐ మురళి సూచించారు. అలైవ్ అరైవ్ రోడ్డు భద్రతలో భాగంగా మంగళవారం అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి సూచనలు చేశారు. అనంతరం రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రాణాపాయల గురించి వివరించారు.