MDK: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో జరిగిన నరేందర్ హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు పడింది. నిందితులు పరశురాములు, చంద్రంలకు ఉమ్రా ఖైదుతో పాటు రూ. 15 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 2022 మే 4న జరిగిన ఈ ఘటనలో, మద్యం సేవించే సమయంలో పాత కక్షలతో స్నేహితులే నరేందర్‌పై దాడి చేసి హత్య చేశారని పోలీసులు వివరించారు.