WNP: పెబ్బేరు మండలంలో 4138 మంది రైతులకు గాను మొత్తం రూ. 35.08 కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. అదే విధంగా 11,459 మంది రైతులకు గాను 24,215 ఎకరాలకు రూ.14.52 కోట్లు పెట్టుబడి కింద రైతు భరోసాను అందించడం జరిగిందన్నారు. మండలంలో మొత్తం 10,783 రేషన్ కార్డులు ఉండగా, వాటిలో కొత్తగా 4398 రేషన్ కార్డులను జారీ చేసినట్లు తెలియజేశారు.