పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ వద్ద గల శ్రీ కట్ట మైసమ్మ ఆలయ రెండో వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హోమం, పంచకర్షణము, మూలమంత్ర హవనాలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.