MBNR: గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామంలో భూ సమస్యల పరిష్కారానికి ఏప్రిల్ 22న గ్రామ సభ నిర్వహించనున్నారు. అలాగే ఏప్రిల్ 24న భూ రీ సర్వే చేపట్టనున్నారు. రైతులు, భూమి యజమానులు గ్రామ సభకు హాజరై తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. సర్వే ద్వారా భూముల హద్దులు, హక్కులు స్పష్టతకు రావడంతో భవిష్యత్తులో వివాదాలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.