MDK: వడదెబ్బ బాధితులకు తక్షణ చికిత్స అందించాలని మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించారు. వేసవి తీవ్రత నేపథ్యంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని, తాగునీరు, ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను అందుబాటులో ఉంచాలని, ICU సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని, జనరేటర్ల పనితీరును పరిశీలించాలని చెప్పారు.