RR: షాద్ నగర్ పట్టణంలోని కుంటపడి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు డిజిటల్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నరసింహులు మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తులు పంపించే లింకులను క్లిక్ చేయడం మూలంగా నష్టపోవడం తప్ప ఏది ఉండదని, సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. క్లిక్ చేసే ముందు ఆలోచించాలని తెలిపారు.