JN: దేవరుప్పుల మండలం దేవునిగుట్ట తండా గ్రామ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన కేతవత్ భారత్ కిషోర్‌ను ఎస్ఎంసీ ఛైర్మన్ బానోత్ రజిత రమేష్, కాంగ్రెస్ నేతలు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ధరావత్ శ్రీను, బిచ్య, రమేష్ తదితరులున్నారు.