NGKL: ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా నాగర్కర్నూల్లో నిర్వహించిన కార్యక్రమంలో DEO రమేశ్ కుమార్ పాల్గొన్నారు. భూమిని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చెట్ల పెంపకం, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ నిషేధం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సైకిల్ ర్యాలీ పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం నింపింది.