HNK: హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో నేడు సర్వోదయ చరఖా అభ్యాస్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనగాల వెంకటరామిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను పునశ్చరణ చేస్తూ, పార్టీ భావజాలాన్ని ప్రతి ఇంటికీ చేరవేయడం మనందరి లక్ష్యమని, శిక్షణ కార్యక్రమంను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.