HNK: నగరంలో చారిత్రాత్మకమైన హనుమద్గిరి పద్మాక్షిదేవి ఆలయంలో నేడు పద్మాక్షి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. ఈరోజు అష్టమి తిథి, శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. అనంతరం పూలతో, పూలమాలలతో అమ్మవారిని అలంకరించి, భక్తుల సమక్షంలో హారతి ఇచ్చారు.