TG: రాష్ట్ర హైకోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని మరోసారి స్పష్టం చేసింది. ఒకవేళ వాహనంలో మద్యం సేవించని వారు ఎవరూ లేకపోతే, ఆ బండిని PSకు తరలించకూడదని తెలిపింది. బదులుగా సదరు వ్యక్తి స్నేహితులు లేదా బంధువులకు ఫోన్ చేసి, వాహనాన్ని వారికి అప్పగించాలని పోలీసులకు కోర్టు సూచించింది.