MLG: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా మంగపేట మండలం తక్కెల్లగూడెంకి చెందిన య్యోరి యానయ్య రెండోసారి నియమింపబడ్డాడు. ఈ సందర్బంగా యానయ్య మాట్లాడుతూ.. క్రమశిక్షణతో పనిచేసిన కార్యకర్తలందరికీ పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందన్నారు. తనను నమ్మి రెండవసారి అధికార ప్రతినిధిగా బాధ్యత ఇచ్చినందుకు మంత్రి సీతక్క, రాష్ట్ర, జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.