WNP: ఆత్మకూరు మున్సిపల్ కార్మికులు విధులను క్రమంగా నిర్వహించాలని కమిషనర్ శశిధర్ ఆదేశించారు. శుక్రవారం తెల్లవారుజామున ప్రధాన వీధుల్లో పర్యటిస్తూ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రోడ్లు, డ్రైనేజీలను ప్రతిరోజూ శుభ్రం చేయాలని, గైర్హాజరు కాకుండా బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఈ పర్యటనలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.