ADB: ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామంలోని హనుమాన్ కాలనీలో నాలాల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. డ్రైనేజీలు పూడికతో నిండిపోయాయి. దుర్వాసనతో పాటు దోమలు, పురుగులు వృద్ధి చెందుతుండటంతో అంటువ్యాధులు ప్రబలుతాయని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి నాలాలను శుభ్రం చేయించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.