KNR: 0తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ‘2 పాడి పశువుల పథకం’ దరఖాస్తు గడువును ఈ నెల 16 వరకు పొడిగించినట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ నెల 16వ తేదీ వరకు OBMMS పోర్టల్లో దరఖాస్తు చేసి, ఆధార్, రేషన్, కులం, ఆదాయం, బ్యాంక్ పాస్బుక్, భూమి పట్టా పత్రాలతో మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.