VKB: కుల్కచర్ల మండల కేంద్రంలో నిర్మాణం చేపడుతున్న సీసీ రోడ్డును కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఇప్పటికే మంజూరైన వివిధ అభివృద్ధి పనులైన సీసీ రోడ్లు, ప్రహారీ గోడల పనులను ఈనెల 27లోపు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులకు పెయింటింగ్ పనులు వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు.