NGKL: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని చెంచులను పునరావాసం పేరిట బలవంతంగా తరలించడం లేదని DFO రేవంత్ చంద్ర స్పష్టం చేశారు. స్వచ్ఛందంగా వెళ్లే వారికే ఈ పథకం వర్తిస్తుందని, అక్కడే ఉండేవారు యథావిధిగా జీవించవచ్చని తెలిపారు. బలవంతపు తరలింపుపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఆయన అచ్చంపేటలో మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.