KMM: కూసుమంచి మండలం పాలేరు పంచాయతీలోని వారాంతపు సంత వేలం పాట వాయిదా పడింది. గురువారం పాలేరులో ప్రజల మధ్య వేలం పాటను ఎంపీడీవో రాజారావు ప్రారంభించారు. 15 మంది పాటదారులు డిపాజిట్ చేశారు. నలుగురు మాత్రమే వేలంలో పాట పాడగా రూ.42,30,000 వరకు పాట పాడారు. కానీ అప్సెట్ ప్రైజ్ రాకపోవడం వేలం మరోసారి నిర్వహిస్తామని ఎంపీడీవో వాయిదా వేశారు.