BDK: నిషేధిత గంజాయి కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను సుజాతనగర్ పోలీసులు నిన్న అరెస్టు చేసినట్లు ఎస్సై రమాదేవి తెలిపారు. ఓ కళాశాల సమీపంలోని ఖాళీ స్థలంలో గంజాయి విక్రయిస్తున్న షేక్ యాకూబ్ పాషా, కుదురుబోయిన నరసింహారావులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 151.6 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించామని అన్నారు.