SRPT: నాగారం మండలం ఈటూరులో ఇవాళ ‘పోలీసు ప్రజా భరోసా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సైబర్ మోసాలు, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంజాయి రహిత గ్రామాలే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని, నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు.