సూర్యాపేట మండలంలోని ఇమాంపేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి శనివారం ప్రారంభించారు. ఇమాంపేట్ సంఘబంధం 1,2 ద్వారా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని కొనియాడారు.