HYD: జీవితం ఒక్కటే, అది ఎంతో విలువైనదని ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. జీవితంలో తాత్కాలికంగా వచ్చే ఇబ్బందుల కారణంగా, తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడకూడదని యువతకు సూచించారు. మనం చేసే ఒక తప్పిదం కుటుంబానికి అపారమైన బాధ కలిగిస్తుందని ఆమె పేర్కొన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు కుటుంబ పెద్దల సహాయం తీసుకుని ధైర్యంగా ఉండాలన్నారు.