NLG: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా రోడ్డు భద్రతపై పోలీసు శాఖ నిర్వహిస్తున్న ‘అరైవ్-అలైవ్’ వారోత్సవాల సభను ఇవాళ నకిరేకల్‌లో నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు నకిరేకల్‌కు డీజీపీ శివధర్‌రెడ్డి రానున్నారు. స్థానిక మినీ స్టేడియంలో సోమవారం రాత్రి నకిరేకల్ సీఐ వై.హరిబాబు సభ స్థల పరిశీలన చేసి ఏర్పాట్లపై చర్చించినట్లు తెలిపారు.