NLG: ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి సుమారు రూ.43 కోట్ల నష్టం కలిగించిన ఇద్దరిని జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు దోమలపల్లి గ్రామ శివారులో నిందితులను పట్టుకున్నాయి. అరెస్టు చేసిన కందుకూరి మహేందర్, కందుకూరి పద్మల వద్ద నుంచి నగదు, సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.