RR: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో ఈనెల 25న మేడ్చల్ జిల్లా కొంపల్లిలో తెలంగాణ జాగృతి పార్టీ ఆవిష్కరణ జరగనుంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పు కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని షాద్ నగర్ నియోజకవర్గ ఇన్ చార్జ్ సీమా రమేష్ ప్రజలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. మహిళా సాధికారత, ప్రజా సమస్యలే లక్ష్యంగా ఈపార్టీ పని చేస్తుందని తెలిపారు.