VKB: జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారని అధికారులు తెలిపారు. ఉదయం 10:40 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11:10 గంటలకు దౌల్తాబాద్ చేరుకుంటారు. కొడంగల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. సీఎం రాక నేపథ్యంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.