WGL: దుగ్గొండి(M) చలపర్తి గోదాంలో ప్రభుత్వ బియ్యం నిల్వలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 200 బస్తాలు గల్లంతైనట్లు గుర్తించిన విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రికార్డుల్లో ఉన్న వివరాలు, వాస్తవ నిల్వలు సరిపోకపోవడంతో సిబ్బంది పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.