ప్రముఖ ఆధ్యాత్మిక కళాకారుడు రామకోటి రామరాజు బసవ జయంతిని పురస్కరించుకుని లక్షలాది అక్షింతలతో బసవేశ్వర స్వామి భారీ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు. గతంలోనూ ఆవాలు, బియ్యంతో ఇలాంటి కళాఖండాలు సృష్టించి భక్తిరత్న జాతీయ అవార్డు అందుకున్న ఆయన, తాజాగా రూపొందించిన చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆయన శివ తత్వంపై ఉన్న భక్తిని ఈ వినూత్న రీతిలో చాటుకున్నారు.