NRML: వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్ సూచించారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో విద్యార్థులు, వాహనదారులతో కలిసి మానవహారం నిర్వహించారు. అనంతరం విద్యార్థులు వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. మైనర్లు వాహనాలు నడపవద్దన్నారు.