NZB: వేసవి సెలవుల నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని బాల్కొండ ఎస్సై శైలేందర్ సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా పిల్లలు, యువకులు ఈత కోసం చెరువులు, కాలువల వద్దకు వెళ్లకుండా నిఘా ఉంచాలని కోరారు. నీటి ప్రవాహాల వద్ద ప్రమాదవశాత్తు ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.