KMM: మధిర మండలం దెందుకూరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం ‘బడిబాట’ కార్యక్రమం నిర్వహించారు. HM శ్యామలరావు నేతృత్వంలో సర్పంచ్ శ్రీనివాసరావు, ఉపసర్పంచ్ ఝాన్సీ వరలక్ష్మి ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో లభించే మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, యూనిఫాం సౌకర్యాలతో పాటు ఆంగ్ల మాధ్యమ బోధన గురించి వివరించారు.