SDPT: పీఆర్సి అమలు, పెండింగ్ డీఏల విడుదలలో జాప్యంపై అక్కన్నపేట తహశీల్దార్ కార్యాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. కార్యాలయం ప్రాంగణంలో శాంతియుతంగా నిరసన చేసి పెండింగ్ డీఏలను తక్షణమే విడుదల చేయాలని, పీఆర్సి అమలు వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.