హనుమకొండలో TRP ముఖ్య నేతల సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీకుమార్ హాజరై మాట్లాడుతూ.. ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ఈనెల 26వ తేదీన ఇందిరా పార్క్ వద్ద నిర్వహించబోయే ధర్నాకు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు.