JGL: రాయికల్ పట్టణానికి చెందిన చొప్పదండి నర్సయ్య సోమవారం తెల్లవారుజామున వాకింగ్ చేస్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడంతో తోటి వాకర్స్ చికిత్స నిమిత్తం జగిత్యాలలోని ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు బంధువులు తెలిపారు.