SDPT: బెజ్జంకి మండలం రేగులపల్లి గ్రామంలోని చెరువు వద్ద ప్రమాదాలు నివారించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. బెజ్జంకి ఎస్సై బోయిని సౌజన్య ఆధ్వర్యంలో హెచ్చరిక బ్యానర్ ఏర్పాటు చేసి చెరువులోకి ప్రవేశం నిషేధమని, ఈత కొట్టడం పూర్తిగా అనుమతిలేదని తెలిపారు. ప్రాణహాని ప్రమాదాలు ఉన్న నేపథ్యంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.