NGKL: లింగాల మండలంలోని శాయిన్పేటలో 120 సంవత్సరాల చరిత్ర గల మర్రిచెట్టును ఎటువంటి అనుమతులు లేకుండా నరికి వేయడం పట్ల గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు. ఇంత చరిత్ర కలిగిన చెట్టు వద్దే మొహరం పండుగను ముగించే సంప్రదాయం ఉందన్నారు. ఒకవైపు ప్రభుత్వమే హరితహారం పేరుతో చెట్లు నాటుతుంటే, ఇలా అనుమతులు లేకుండా చెట్లను నరకడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.