నిర్మల్ మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల కోసం దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. మున్సిపాలిటీలో ప్రత్యేక పరిజ్ఞానం అనుభవం కలిగిన ఇద్దరు సభ్యులను (ఇందులో 1 మహిళ, పురుషులు), మైనార్టీ విభాగంలో ఇద్దరు (ఒకరు మహిళ, పురుషుడు) ఎన్నుకోవాల్సి ఉంది. ఈ నెల 21 లోపు ఆసక్తి గలవారు మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.