MBNR: దేవరకద్ర మండలం అజిలపురంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అర్హులైన ప్రతి పేదవానికి సొంత గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల కల నెరవేరినందుకు లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.