PDPL: గిత్యాలలో ఈనెల 20న నిర్వహించే జైత్ర యాత్ర సభను BRS శ్రేణులు జయప్రదం చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చందర్ అన్నారు. ఈ మేరకు ఆయన గోదావరిఖనిలో పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పాలని తెలిపారు. కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.