MBNR: చిన్న చింతకుంట మండలం ఫర్దీపూర్ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆకర్షితులై తాము పార్టీ మారుతున్నట్లు వారు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.